: అంతా అనుకున్నట్టే 'డయానా' పేరు పెట్టారు!
అంతా అనుకున్నట్టే కొత్త యువరాణికి తన తల్లి పేరు పెట్టారు ప్రిన్స్ విలియం. బ్రిటిష్ రాజ కుటుంబంలో కొత్తగా శనివారం జన్మించిన యువరాణికి ఏ పేరు పెడతారంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడిచింది. విలియం, మిడిల్టన్ దంపతులకు తొలి సంతానం జన్మించినప్పుడే దీనిపై ఓ చర్చ నడిచింది. రెండోసారి రాణి పుట్టిందని తెలియగానే మరోసారి అదే చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఆమెకు 'షార్లట్ ఎలిజబెత్ డయానా' అని పేరు పెట్టారు. కాగా, ఇంగ్లండ్ సింహాసనాన్ని అధిష్ఠించే వరుసలో నాలుగో వారసురాలిగా ఉన్న ఆమెను, 'హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ షార్లట్ ఆఫ్ కేంబ్రిడ్జి'గా సంబోధిస్తారు. కాగా, యువరాణి తాత ప్రిన్స్ చార్లెస్, తాతమ్మ ఎలిజబెత్ 2, నాన్నమ్మ డయానా, ఈ ముగ్గురి పేర్లు కలిసి వచ్చేలా యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ఈ పేరు పెట్టడం విశేషం.