: వెలివేసిన గ్రామ పెద్దలు...లబోదిబోమంటున్న మత్స్యకారులు


కాలం మారింది, సాంకేతికతో ప్రపంచం దూసుకుపోతోంది. అయినప్పటికీ సాంఘిక దురాచారాలు అంతం కావడం లేదు. గ్రామాభివృద్ధికి 25 వేల రూపాయలు కట్టలేదని 50 మత్స్యకార కుటుంబాలను వెలివేసిన ఘటన వెలుగు చూసింది. కరీంనగర్ జిల్లాలోని యొకన్ పూర్ గ్రామంలో 50 మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి సరకులు పంపిణీ చేయవద్దని, ఆ కుటుంబాలలోని వ్యక్తులతో మాట్లాడవద్దని గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. దీంతో మత్స్యకార కుటుంబాలు పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాయి. చెరువులు ఎండిపోయి, ఉపాధి లేకపోవడంతో తాము కట్టలేకపోయామని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News