: లా పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయిన ఐజీ


కేరళలోని త్రిసూర్ రేంజ్ ఐజీ టీజే జోస్ దూరవిద్య విధానంలో ఎల్ఎల్ఎం అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. వార్షిక పరీక్షల్లో ఐజీ దొరవారు ఫెయిలయ్యారు. దీంతో, సప్లిమెంటరీ తప్పలేదు. ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలని నిశ్చయించుకున్న ఆయన అడ్డదారి తొక్కారు. పరీక్ష పేపర్ల మధ్య చీటీలు పెట్టుకుని సీరియస్ గా కాపీ కొట్టసాగారు. ఇది గమనించిన ఇన్విజిలేటర్ పట్టుకుని, చీటీలు లాగేసుకున్నారు. వెంటనే ఐజీని బయటికి పంపించివేశారు. తాము ఈ విషయాన్ని మహాత్మాగాంధీ వర్శిటీకి నివేదించామని పరీక్ష కేంద్రం సెయింట్ పాల్స్ కళాశాల ప్రిన్సిపాల్ పీటర్ తెలిపారు. సదరు ఐజీ గారు మాత్రం కాపీకి పాల్పడలేదని చెబుతున్నారు. పరీక్షను నిర్ణీత సమయానికి కంటే ముందే రాశానని, అందుకే కాస్త ముందుగానే బయటికొచ్చానని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News