: ప్రసాదరెడ్డి రౌడీషీటర్... పాతకక్షలతోనే హత్య: కాల్వ శ్రీనివాసులు
రాప్తాడులో హత్యకు గురైన వైసీపీ నేత ప్రసాదరెడ్డిపై అనేక కేసులున్నాయని, అతడో రౌడీషీటర్ అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. పాతకక్షలతోనే అతడు హతమయ్యాడని, హత్యా రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ దూరమని స్పష్టం చేశారు. ప్రసాదరెడ్డి హత్య కేసులో అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. ఈ హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు.