: ఇప్పుడు ఎవరెస్టు ఎక్కాలంటే తాతలు దిగిరావాలి!


సాధారణంగా ఎవరెస్టు శిఖరం అధిరోహించాలంటేనే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెస్టు అధిరోహించాలంటే తాతలు దిగిరావాల్సిందేనని నేపాల్ అధికారులు పేర్కొంటున్నారు. ఎవరెస్టు శిఖరం అధిరోహించాలనుకునే ఔత్సాహికులు ఎవరైనా అక్కడి షెర్పాలను వెంటబెట్టుకుని వెళ్తారు. వారికి దారి తెలియడం, సులువుగా శిఖరం అధిరోహించే చిట్కాలు తెలియడంతో క్లైంబర్స్ వారిని నమ్ముకుంటారు. నేపాల్ లో సంభవించిన భూకంపం కారణంగా బేస్ క్యాంపులన్నీ శిథిలాలుగా మిగిలాయి. 22 మంది పర్వతారోహకులు మృత్యువాత పడగా, 217 మంది గల్లంతయ్యారు. ఇంకా చాలా మంది మారుమూల కొండప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడానికి కూడా కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో ఎవరెస్టు పర్వతారోహణ నిలిపివేయాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరెస్టుపై విధ్వంసం కారణంగా, ఈ సీజన్ లో పర్వతారోహణ కుదరదని, సరైన మార్గం నిర్ణయించలేమని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News