: నిప్పుల కొలిమిగా మారుతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ సముద్ర తీర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. రెంటచింతలలో గరిష్ఠంగా 43 డిగ్రీలు, కర్నూలులో 41, అనంతపురంలో 40, నందిగామలో 39, ఒంగోలు, తిరుపతిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా, తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్ లలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రెండు రాష్ట్రాల్లో కూడా సాధారణంకన్నా 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.