: శివాజీ దీక్ష విరమించాలి: వసంత నాగేశ్వరరావు


సినీ నటుడు శివాజీ ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు సూచించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, 'ప్రత్యేకహోదా అంధ్రుల హక్కు' అని అన్నారు. ప్రత్యేకహోదా కోసం రాజకీయ పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాలని ఆయన సూచించారు. ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని శివాజీ దీక్ష విరమించాలని ఆయన కోరారు. కాగా, శివాజీకి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వారు చెప్పారు. బీపీ, షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయని వారు వెల్లడించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ సినీ నటుడు శివాజీ చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News