: యమునా నదిలో వెదురుబుట్ట... ఆ బుట్టలో శిశువు!


మహాభారతంలో సూర్యుడి ద్వారా కర్ణుడిని కన్న కుంతి లోకానికి భయపడి ఆ శిశువును ఓ బుట్టలో పెట్టి నదిలో వదిలేయడం తెలిసిన విషయమే. తాజాగా, ఉత్తరప్రదేశ్ లోని శిల్వాలీ గ్రామంలో యమునా నదిలో తేలుతూ ఓ బుట్ట, అందులో శిశువు కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వెదురుబుట్టను గుర్తించిన స్థానికులు పడవ సాయంతో దగ్గరకు వెళ్లి పరీక్షించగా, మగశిశువు అని తెలిసింది. ఎండవేడిమికి చర్మం కమిలిపోయింది. ఆ పసికందు బతికే ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొలుత, మామూలు బుట్టేనని భావించిన స్థానికులు, ఆపై దగ్గరకు వెళ్లి పరిశీలించడంతో శిశువు కనిపించాడు.

  • Loading...

More Telugu News