: లోకేశ్ కు దీటుగా కేటీఆర్... 18న సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ
తెలుగు రాష్ట్రాల సీఎంల కొడుకులిద్దరూ పోటాపోటీ పర్యటనల్లో బిజీబిజీగా ఉన్నారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం ఇద్దరూ అమెరికా బాట పట్టారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ నేటి ఉదయానికే అమెరికా చేరుకోగా, రేపు ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ అమెరికా బయలుదేరుతున్నారు. లోకేశ్ తన అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 7న ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఇక కేటీఆర్ తన అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 18న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశం కానున్నారు. అంతకుముందే ఈ నెల 6న వాషింగ్టన్ లోని భారత రాయబారితోనూ కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ మేరకు కేటీఆర్ టూర్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైందనే చెప్పాలి.