: అమెరికాలో నారా లోకేశ్ కు అడుగడుగునా నీరాజనం... ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసిన నాటా
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు అమెరికా పర్యటనలో అడుగడుగునా నీరాజనం లభిస్తోంది. నేటి ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాండైన ఆయనకు అక్కడి ఎన్నారై టీడీపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడి నుంచి లాస్ ఏంజెలిస్ కు వెళ్లేందుకు సిద్ధమైన లోకేశ్ కు నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. లాస్ ఏంజెలిస్ లోనూ లోకేశ్ కు ఘన స్వాగతం లభించింది. లాస్ ఏంజెలిస్ లో నాటా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన స్మార్ట్ విలేజ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి ముగ్ధులైన నాటా సభ్యులు అక్కడికక్కడే స్పందించి, ఏపీలోని 150కి పైగా గ్రామాలను దత్తత తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.