: మరణశిక్ష అనుభవించిన ఆండ్రూ చాన్ నిజమైన హీరో అంటున్న ఉరిశిక్షపడ్డ మహిళ
డ్రగ్స్ సరఫరా కేసులో గతవారం మరణదండన శిక్షను అనుభవించి శాశ్వతంగా దూరమైన ఆండ్రూ చాన్ తాను చూసిన నిజమైన 'హీరో' అని ఇటువంటి కేసులోనే త్వరలో ఉరితీయబడనున్న బ్రిటన్ మహిళ లిండ్సే సాండీఫోర్డ్ (58) అంటోంది. ఆమె ఉరికి ఇండోనేషియా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో లిండ్సే తన బంధుమిత్రులకు లేఖలు రాసింది. అందరికీ సెలవంటూ, తనను ఏ క్షణమైనా ఉరితీయవచ్చని, రేపే ఈ సెల్ నుంచి తీసుకెళ్లి ఉరికంబాన్ని ఎక్కించవచ్చని, అయినా తాను భయపడడం లేదని తెలిపింది. డ్రగ్ సిండికేట్ దారులు తన కొడుకును హత్య చేస్తామని బెదిరించడం వల్లే తాను ఈ పని చేయాల్సి వచ్చిందని వాపోయింది.