: నన్ను ఫెయిల్ చేశారో... మంత్రాలతో చంపేస్తా: విద్యార్థి హెచ్చరిక
ఆ విద్యార్థి పదో తరగతి పరీక్షలు రాశాడు. సరిగ్గా రాయలేదో ఏమో... పేపర్లు దిద్దే టీచర్లను ఉద్దేశించి ఓ లేఖ రాసి సమాధానపత్రానికి జత చేశాడు. తనను పరీక్షల్లో ఫెయిల్ చేశారంటే, మీతో పాటు మీ ఇంట్లో వారందరినీ మంత్రాలతో చంపేస్తానని ఆ లేఖలో బెదిరించాడు. ఆ విద్యార్థి రాసిన లేఖను కర్ణాటక విద్యాశాఖాధికారులు విడుదల చేశారు. ఈ విద్యార్థి హరిహర ప్రాంతానికి చెందినవాడని వెల్లడించిన అధికారులు మరిన్ని వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. తనను ఫెయిల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపిన విద్యార్థి, తన సమాధాన పత్రం చూడకుండా పాస్ చేసేయాలని కూడా డిమాండ్ చేశాడట.