: 'చనిపోదాం' అని చెప్పి పురుగుల మందు తాగించాడు... తాను పరారయ్యాడు!


తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన రారాజు, శాంతి ప్రేమికులు. రారాజు ఇంటర్ చదువుతున్నాడు. కాగా, ఈ జంట కొన్నాళ్లుగా రహస్యంగా సహజీవనం చేస్తోంది. కాగా, ప్రేమ వ్యవహారం తమవారికి తెలిసిందని, చనిపోదాం అని చెప్పి శాంతిని ఒప్పించాడు రారాజు. ప్రియుడి ఎత్తుగడ తెలియని ఆ అమ్మాయి, అతడు చెప్పినట్టుగా జగ్గంపేట సమీపంలోని పోలవరం కాల్వ వద్దకు వచ్చింది. పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదన్నాడు. చనిపోదాం అంటూ చెప్పి తొలుత ఆమెతో పురుగుల మందు తాగించాడు. దీంతో, కొద్దిసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో, శాంతిని ఆమె పిన్ని ఇంటికి తీసుకెళ్లి ఏదో కట్టుకథ అల్లి చెప్పాడు. అనంతరం పరారయ్యాడు. శాంతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు తమ కుమార్తెను ఆసుపత్రిలో చేర్పించినా ప్రయోజనంలేకపోయింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఇప్పుడు రారాజు కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది.

  • Loading...

More Telugu News