: ఆసక్తికరంగా ముంబై, పంజాబ్ మ్యాచ్
చండీగఢ్ లోని మొహాలీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ముంబై విసిరిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ 11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో మురళీ విజయ్ (36 బ్యాటింగ్), డేవిడ్ మిల్లర్ (24 బ్యాటింగ్) ఉన్నారు. సెహ్వాగ్ 2 పరుగులు చేసి మలింగ బౌలింగ్ లో పొలార్డ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. విధ్వంసక మ్యాక్స్ వెల్ 12 పరుగులు చేసి నిరాశపరిచాడు.