: పురందేశ్వరిదీ అదే మాట... నటుడు శివాజీ బీజేపీ సభ్యుడు కాడా?
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నటుడు శివాజీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ కార్యదర్శి కోటేశ్వరరావు ఇంతకుముందు ప్రకటించడం తెలిసిందే. తాజాగా, శివాజీ గుంటూరులో దీక్ష చేపట్టడంపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె మాట్లాడుతూ... శివాజీ బీజేపీ సభ్యుడు కాదన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఇదివరకే ప్రకటించారని గుర్తుచేశారు. శివాజీకి పార్టీతో సంబంధం లేదని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అధిక శాతం నిధులు అందిస్తోందని వివరించారు.