: వాస్తవానికి నేనే గెలిచాను... ఆక్రోశించిన పకియావ్


ఈ శతాబ్దపు పోరుగా ప్రచారం పొందిన వెల్టర్ వెయిట్ విభాగం బాక్సింగ్ బౌట్లో వాస్తవానికి గెలిచింది తానేనని ఫిలిప్పీన్స్ యోధుడు మ్యానీ పకియావ్ ఆక్రోశిస్తున్నాడు. చాంపియన్ ఫ్లాయిడ్ మేవెదర్ ను తాను ఈ పోటీలో అనేక మార్లు బీట్ చేశానని, అతడిపై ఆధిపత్యం చెలాయించానని తెలిపాడు. పన్నెండు రౌండ్ల పాటు సాగిన ఈ బౌట్ ముగిసిన అనంతరం న్యాయనిర్ణేతలు మేవెదర్ ను విజేతగా నిర్ణయించడం పట్ల పకియావ్ విస్మయం చెందాడు. అతడు తనపై విసిరిన పంచ్ ల కంటే తాను అతనిపై విసిరిన పంచ్ లే ఎక్కువని వివరించాడు. ఈ పోటీపై సోషల్ మీడియాలో కూడా పకియావ్ అనుకూల పవనాలే వీస్తున్నాయి.

  • Loading...

More Telugu News