: పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ ప్రెస్
ముంబై నుంచి ఎర్నాకుళం మధ్య ప్రయాణించే దురంతో ఎక్స్ ప్రెస్ ఈ ఉదయం గోవా పరిధిలోని బాలీ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. మొత్తం పది బోగీలు పట్టాలు తప్పాయని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక ప్రతినిధి బాబన్ గాట్గే తెలిపారు. ఉదయం 6:30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని వివరించారు. ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ జరగలేదని తెలిపారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినల్ నుంచి బయలుదేరిన రైలు ఎర్నాకుళం వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. దీంతో ఈ మార్గంలో తిరిగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు ఎందుకు పట్టాలు తప్పిందన్న విషయంపై అధికారులు విచారణ మొదలుపెట్టారు.