: దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు కానిస్టేబుళ్లు
వారు ప్రజా రక్షణ బాధ్యతలు నిర్వర్తించే కానిస్టేబుళ్లు. అయితేనేం, వారి బుద్ధి పక్కదారులు పట్టింది. చోరీ చేశారు. ఇప్పుడు పట్టుబడ్డారు. కర్ణాటక నుంచి వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు కర్నూలు, ఆదోనిల్లో పోలీసు శాఖలో కానిస్టేబుల్ హోదాలో విధులు నిర్వహిస్తున్న వారు కావడంతో పోలీసు శాఖలో కలకలం రేపింది. వీరిద్దరిపై కర్ణాటకలో చోరీ కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో భాగంగా ఇద్దరు కానిస్టేబుళ్లను ఇంటరాగేట్ చేస్తున్నట్టు సమాచారం. వీరిని కర్ణాటక తీసుకువెళ్లేందుకు కోర్టు అనుమతి కోరాలని పోలీసులు నిర్ణయించారు.