: కూతురు కనిపిస్తేనే ఇంటికి వెళతామంటూ, కాళ్లరిగేలా తిరుగుతున్న దంపతులు
కనిపించకుండా పోయిన తమ కూతురి జాడ కోసం ఆ దంపతులు రెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లికి చెందిన రమణయ్య కుమార్తె కృష్ణమ్మ 2013లో స్కూల్‌కు వెళ్లి తప్పిపోయింది. నాటి నుంచి నేటి వరకూ తమ ఇంటికి కూడా వెళ్లకుండా ఊరూరా గాలిస్తున్నారు కృష్ణమ్మ తల్లిదండ్రులు. కృష్ణమ్మ జూబ్లీహిల్స్ లో కనిపించిందని ఎవరో చెబితే నెల్లూరు నుంచి శనివారం హైదరాబాదుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనులో ఆరా తీశారు. తాము ఇప్పటివరకూ బిడ్డను వెతుకుతూ, 10 సార్లు హైదరాబాదుకు వచ్చి వెళ్లామని, కుమార్తె లేకుండా ఊరికి వెళ్లబోమని వారు అంటున్నారు.