: మొదలైన బిగ్ ఫైట్!


ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన పోరుగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ ఫైట్ మొదలైంది. అమెరికాకు చెందిన కింగ్స్‌ ఫ్లాయిడ్ మేవెదర్, ఫిలిప్పీన్స్ కు చెందిన మ్యానీ పాకియోలు రింగ్ లో ముఖాముఖి పోటీకి దిగారు. 63.5 కేజీల నుంచి 67 కేజీల కేటగిరీలో జరగనున్న పోరులో 3 నిమిషాల నిడివి ఉండే 12 రౌండ్లు జరుగుతాయి. ఈ పోరులో ఎవరైనా, ఏ దశలోనైనా ప్రత్యర్థి కోలుకోలేని దెబ్బ కొట్టి నాకౌట్ చేస్తే అక్కడే పోరు ముగుస్తుంది. ఒకవేళ మొత్తం 12 రౌండ్లు జరిగితే పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. అందరినీ ఆకర్షిస్తున్న ఈ బిగ్ ఫైట్ లో విజేత ఎవరో మరికాసేపట్లో తెలుస్తుంది.

  • Loading...

More Telugu News