: గవర్నర్ ను కలిసి తెలుగుదేశంపై ఫిర్యాదు చేయనున్న జగన్!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. సోమవారం నాడు జగన్, నరసింహన్ ను కలవనున్నారని, ఈ మేరకు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయిందని సమాచారం. ఇటీవలి కాలంలో జరిగిన వైకాపా నేతల హత్యల గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకే జగన్ కలవనున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఫ్యాక్షన్ రాజకీయాలకు తమ నేతలు బలవుతున్నారని జగన్ ఇప్పటికే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలపైనా చర్చిస్తారని తెలుస్తోంది.