: బాలయ్య బాబు అన్నా, చంద్రబాబు అన్నా నాకు అభిమానం: జగపతిబాబు
బాలయ్య బాబు అంటే తనకు చాలా ఇష్టమని నటుడు జగపతిబాబు చెప్పారు. 'లెజెండ్' సినిమా 400 రోజుల విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడుతూ, బాలయ్యను సినీ పరిశ్రమలో అంతా చాలా మంచి మనిషి అంటారని అంటుండగా... వెంటనే బాలయ్య వచ్చి 'లెజెండ్' సినిమాలో డైలాగ్ చెబుతూ, జగపతిబాబును కౌగిలించుకున్నారు. దాంతో ఉబ్బితబ్బిబ్బయిన జగపతిబాబు, 'తామిద్దరం ఆత్మీయమైన స్నేహితులమని' చెప్పారు. అభిమానుల కోసం తామిద్దరం మరో సినిమాలో చేస్తామని, అయితే ఈసారి కొట్టుకుంటామో లేదో తెలీదని జగపతి బాబు నవ్వుతూ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అంటే తనకు చాలా ఇష్టమని జగపతిబాబు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కలుద్దామని అనుకున్నానని, కానీ ఏదైనా ఆశించి కలిసానని భావిస్తారని కలవలేదని జగపతిబాబు చెప్పారు.