: 200 కోట్ల భారీ ఫైట్ కు అంతా సిద్ధం


ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత ఖరీదైన పోరుకు రంగం సిద్ధమైంది. బాక్సింగ్ చరిత్రలో అంత్యంత ఖరీదైన బౌట్ గా పేరొందిన దీనిని నిర్వహించేందుకు లాస్ వెగాస్ సన్నాహాలు పూర్తి చేసుకుంది. అమెరికా బాక్సర్ మే వెదర్, ఫిలిప్పీన్స్ బాక్సర్ పకియావ్ అమీతుమీకి సిద్ధమయ్యారు. మే వెదర్, పకియావ్ ల ఘనత గురించి చెప్పాలంటే బాక్సింగ్ లో వీరి వశం కాని రికార్డులు లేవంటే అతిశయోక్తి కాదు. 38 ఏళ్ల మే వెదర్, లైట్ వెయిట్, లైట్ ఫెదర్ వెయిట్, వెల్టర్ వెయిట్, లైట్ మిడిల్ వెయిట్, సూపర్ ఫెదర్ వెయిట్, వరల్డ్ ఛాంపియన్ షిప్ ఇలా ఆరు విభాగాల్లో ప్రపంచ ఛాంపియన్ ఇప్పటి వరకు ఓటమిలేని బాక్సర్ గా రికార్డులకెక్కాడు. పకియావ్ కూడా ఇలాంటి చరిత్ర కలిగినవాడే. 36 ఏళ్ల పకియావ్ ఎనిమిది డివిజన్లలో ప్రపంచ ఛాంపియన్. అదీ కాక పకియావ్ ఇప్పటి వరకు 62 బౌట్లలో తలపడితే కేవలం ఐదు బౌట్లలో మాత్రమే ఓటమిపాలయ్యాడు. రేపు ఉదయం భారత కాలమానం ప్రకారం 8:30కి మెదలు కానుంది. స్టేడియం సామర్థ్యం 16,800. కాగా టికెట్ కనిష్ట ధర 95,000 రూపాయలు కాగా, గరిష్టం 6.3 లక్షల రూపాయలు. ఈ బౌట్ ద్వారా సుమారు రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News