: ఆ ముగ్గురి చేతుల్లోనే బీజేపీ...నేతలు బెంబేలెత్తుతున్నారు: బీజేపీ నేత అరుణ్ శౌరీ


ప్రముఖ జర్నలిస్టు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ శౌరీ తన సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. బీజేపీ ముగ్గురు వ్యక్తుల చేతుల్లో బందీగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీల చేతుల్లో పార్టీ చిక్కుకుపోయిందని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురు నేతల దెబ్బకు పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. ఇక మోదీ అభివృద్ధి మంత్రంపైనా అరుణ్ శౌరీ విమర్శలు సంధించారు. మోదీ చెబుతున్న మాటలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని కూడా ఆయన అన్నారు. పత్రికల్లో ప్రధాన శీర్షికలను అలంకరించడమే ఆ ప్రసంగాల లక్ష్యమని మరింత ఘాటుగా స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ ఘోరంగా విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News