: ప్రత్యేక హోదా వద్దనడం వెంకయ్యకు తగదు: మండిపడ్డ బొత్స


కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ లపై మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్ర హోదాపై వీరు చేస్తున్నదేమీ లేదని మండిపడ్డారు. వెంకయ్యనాయుడు ఇక్కడ ఒకలా, ఢిల్లీలో మరోలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దనడం వెంకయ్యకు సరికాదని ఆయన అన్నారు. మరోవైపు, ప్రత్యేక హోదాపై అవగాహన లేకుండా నిర్మాలా సీతారామన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, వివిధ దేశాల పర్యటనలతో గడిపేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News