: క్యాంపస్ ఇంటర్వ్యూలో విప్రోకు సెలెక్ట్ అయ్యాడు... కానీ, ఇంతలోనే లారీ అతన్ని బలిగొంది
బీటెక్ చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ కాలేజ్ లో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో విప్రో సంస్థకు ఎంపికయ్యాడు. దీంతో, లైఫ్ సెటిల్ అయిపోయిందన్న ఆనందంలో ఉన్న ఆ యువకుడిని దురదృష్టం లారీ రూపంలో వెంటాడింది. విశాఖపట్నం సబ్బవరం వద్ద బైక్ పై వెళుతున్న అతడిని లారీ ఢీకొట్టింది. దీంతో అతను దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. శ్రీకాంత్ మరణంతో అతడి కుటుంబంలో విషాదం అలముకుంది.