: ఆరేళ్ల బాలికను చిదిమేసిన బస్సు... ఆగ్రహంచిన స్థానికుల చేతిలో బస్సు ధ్వంసం


హైదరాబాదులోని ఓల్డ్ మలక్ పేటలో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన ఓ ప్రైవేట్ బస్సు ఆరేళ్ల బాలిక మహేశ్వరిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఘటన జరిగిన వెంటనే బస్సు నుంచి కిందకు దూకిన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక మృతితో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. అంతేకాక ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు బస్సుపై దాడి చేశారు. స్థానికుల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News