: కేవీపీకి కలిసి వచ్చిన వియన్నా కోర్టు నిర్ణయం


టైటానియం కేసులో ఎంపీ కేవీపీ రామచంద్రరావును తమకు అప్పగించాలంటూ ఇంటర్ పోల్ కు అమెరికా చేసిన విజ్ఞప్తి నెరవేరేలా కనిపించడం లేదు. ఇండియాలో టైటానియం గనులను దక్కించుకునేందుకు లంచాలిచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ వ్యాపారి ఫిర్తాష్ ను అమెరికాకు అప్పగించేందుకు వియన్నా న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో, కేసు ముందుకు సాగే అవకాశం లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో కేవీపీకి ఊరట లభించినట్టేనని వారు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News