: నేపాల్ భూకంపం వారి ప్రేమను బయటపెట్టింది
నేపాల్ భూకంపం యువజంట ప్రేమను బయటపెట్టింది. రమీలా శ్రేష్ఠ (17). స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్తానని ఇంట్లో చెప్పి బాయ్ ఫ్రెండ్ సంజీబ్ (17)తో కలిసి నేపాల్లోని ప్రముఖ చారిత్రాత్మక ధరహరా టవర్ పైకెక్కారు. రోజంతా అక్కడే గడిపి, మళ్లీ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవాలనుకున్నారు. టవర్ ఎనిమిదో అంతస్తులోని బాల్కనీ వద్దకు చేరుకునే సరికి టవర్ ఊగడం మొదలు పెట్టింది. కాసేపటికి అక్కడ అరుపులు, కేకలు చోటుచేసుకున్నాయి. టవర్ ఉన్నపళంగా కూలిపోయింది. మరీ ఎత్తునుంచి పడిపోవడంతో ప్రేమికులిద్దరూ స్పృహతప్పిపోయారు. వారిద్దరూ సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయినప్పటికీ ప్రాణాలతో మిగలడం విశేషం. వారి తల, వెన్నెముకకు గాయాలయ్యాయని, మరింత కాలం రెస్టు తీసుకోవాలని వైద్యులు వారికి సూచించగా, రెండిళ్లలో వారి ప్రేమ వ్యవహారం తెలిసిపోయింది. వారి ప్రాణాలు నిలబడ్డాయి. మరి వారి ప్రేమ నిలుస్తుందో లేదో చూడాలి!