: వృద్ధ కళాకారులకు 'మా' అసోసియేషన్ పింఛన్లు


'మే'డే సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలోని 26 మంది వృద్ధ కళాకారులకు 'మా' అసోసియేషన్ ఈ రోజు పెన్షన్లు అందించింది. హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో పలువురు సీనియర్ నటులకు అసోసియేషన్ సభ్యులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా పేద కళాకారులకు పెన్షన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. తామిచ్చిన పెన్షన్ మొత్తం వారికి సరిపోదని తమకు తెలుసునని, ముందు ముందు ఆ మొత్తాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అసోసియేషన్ తరపున సేవా కార్యక్రమాలు ప్రారంభించామని, వాటిని మరింత పెంచుతామని రాజేంద్రుడు చెప్పారు.

  • Loading...

More Telugu News