: ఏపీలో హైకోర్టు నిర్మించాకే కోర్టు విభజన: ఉమ్మడి హైకోర్టు తీర్పు


హైకోర్టు విభజనను ఇప్పటికిప్పుడు చేపట్టేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. ఏపీలో హైకోర్టు నిర్మించాకే విభజన జరుగుతుందని స్పష్టం చేసింది. అప్పటివరకు ఇరు రాష్ట్రాలకు కోర్టు ఉమ్మడిగానే కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఏపీలో హైకోర్టు నిర్మించేందుకు కేంద్రమే నిధులు మంజూరు చేయాలని పేర్కొంది. అయితే తెలంగాణ భూభాగంలో హైకోర్టు ఏర్పాటుకు వీల్లేదని, విభజన చట్టప్రకారం ఇప్పుడున్న కోర్టు తెలంగాణకే చెందుతుందని ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది. మరోవైపు ఏపీ రాజధాని ప్రాంత రైతులకు హైకోర్టులో ఊరట కలిగింది. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన వారి జోలికి వెళ్లవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News