: తెలంగాణ కార్మికులకు కేసీఆర్ వరాల జల్లు


హైదరాబాదులోని రవీంద్రభారతిలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, నాయిని నర్సింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికలోకానికి శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్ వరాలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షలకు పైగా డ్రైవర్లు ఉన్నారని, వారందరికీ ప్రమాద బీమా కల్పిస్తామని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని హోంగార్డులు, తెలంగాణ జర్నలిస్టులకు కూడా ఈ బీమా వర్తిస్తుందని చెప్పారు. మహిళా కార్మికులకు ప్రసూతి సమయంలో ఇచ్చే ఆర్థికసాయం రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచామన్నారు. సహజ మరణం పాలైన వారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం రూ.30వేల నుంచి రూ.60వేలకు పెంచినట్టు, ప్రమాద సమయంలో చనిపోయేవారికిచ్చే రూ.2 లక్షలను రూ.5 లక్షలకు పెంచినట్టు కేసీఆర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News