: ఏపీ పరిధిలో తపాలా శాఖ తొలి ఏటీఎం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో తపాలా శాఖ తొలి ఏటీఎం ప్రారంభమైంది. ఆ శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బి.వి. సుధాకర్ ఏటీఎంను ఈ రోజు ప్రారంభించారు. పది రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో 4 ఏటీఎంలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. 2016 మార్చి నాటికి ఇరు రాష్ట్రాల్లో 95 ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని చీఫ్ పోస్ట్ మాస్టర్ వెల్లడించారు. అయితే మనీయార్డర్ సేవల ఉపసంహరణ ఆలోచన లేదని తెలిపారు. కాగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఏర్పాటుకు ప్రతిపాదన పంపినట్టు సుధాకర్ వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 'సుకన్య సమృద్ధి యోజన' కింద 4 లక్షల ఖాతాలు తెరిచినట్టు ఆయన అన్నారు.