: తూర్పు గోదావరి జిల్లాపై మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది: చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడలో టూరిజం పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ, టూరిజంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. దేశానికి అన్నం పెట్టిన జిల్లా తూగో జిల్లా అని, ఈ జిల్లాపై తమకు ప్రత్యేక శ్రద్ధ ఉందని పేర్కొన్నారు. కాకినాడకు రెండు ఓడరేవులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉందని, అందుకు నాలుగేళ్లు పడుతుందని వెల్లడించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని వాడుకునేందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేబడుతున్నామని బాబు వివరించారు.