: ఇండియా అంటే మీకు తెలిసింది ఇంతేనా... అమెరికాకు మోదీ సర్కారు కౌంటర్


ఇండియాలో మత స్వేచ్ఛపై అమెరికన్ సంస్థ 'ది యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్' (యూఎస్‌ఈఐఆర్‌ఎఫ్) చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. భారత్ పై అవగాహన లేకనే ఇటువంటి నివేదికలు రాస్తారని మండిపడింది. ఇండియా గురించి తెలుసుకున్నది ఇంతేనా? అని ప్రశ్నించింది. అసలు ఈ నివేదిక గురించి ఆలోచించనవసరం లేదని తెలిపింది. ఇండియాలో మత స్వేచ్ఛ తక్కువని, హిందూ సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ లు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నాయని, అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని యూఎస్‌ ఈఐఆర్‌ఎఫ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఘర్ వాపసీ అంటూ 4 వేల మంది క్రిస్టియన్లను, 1000 మంది ముస్లింలను బలవంతంగా హిందూ మతంలోకి చేర్చారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News