: మా తెలివితేటలను దోచుకుంటున్న భారత్, చైనా: అమెరికా


తమ పౌరులు అభివృద్ధి చేసిన సాంకేతికతను వాడుకుంటూ, అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తున్న వాణిజ్య భాగస్వామ్య దేశాల జాబితాలో ఇండియా, చైనాలు ముందు నిలుస్తున్నాయని అమెరికా వాపోతోంది. అమెరికాకు చెందిన మేధో సంపత్తి హక్కులను (ఐపీఆర్) కాపాడటంలో ఈ దేశాలు విఫలమవుతున్నాయని తెలిపింది. ఈ మేరకు మొత్తం 13 దేశాలను 'నిఘా' జాబితాలో చేర్చుతున్నట్టు యూఎస్ వాణిజ్య విభాగం తన వార్షిక నివేదికలో పేర్కొంది. గత సంవత్సరం ఈ జాబితాలో 10 దేశాలుండగా, తాజాగా, ఈక్వెడార్, ఉక్రెయిన్, కువైట్ లను తాజాగా కలిపినట్టు వెల్లడించింది. ఈక్వెడార్ లో కాపీరైట్ హక్కులు, ట్రేడ్ మార్క్ నిబంధనలు పాటించడం లేదని, పైరసీ పెరిగిందని తెలిపింది. యూఎస్ కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాలో ఐపీఆర్ సంస్కరణల అమలు జరగడం లేదని పేర్కొంది. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలపై స్పందన కొరవడిందని, ప్రభుత్వ సంస్థలే చట్ట వ్యతిరేకంగా సాఫ్ట్ వేర్ వాడుతున్నాయని తెలిపింది. కాపీరైట్ చట్టాన్ని తీసుకురావడంలో కువైట్ విఫలమైనందునే ఈ జాబితాలో చేర్చామని తెలిపింది. తమ మేధో సంపత్తి హక్కులను పలు దేశాలు కాలరాస్తుండడంతో, లక్షల కొద్దీ అమెరికన్లు ఉపాధిని కోల్పోతున్నారని తెలిపింది. ఈ జాబితాలో భారత్, చైనాలతో పాటు అర్జెంటీనా, అల్జీరియా, చీలీ, ఇండోనేషియా, పాకిస్థాన్, రష్యా, థాయ్ లాండ్, వెనిజులా తదితర దేశాల పేర్లనూ యూఎస్ కామర్స్ డిపార్ట్ మెంట్ చేర్చింది.

  • Loading...

More Telugu News