: టైమొస్తే ప్రాణాలు ఎక్కడున్నా పోతాయి: సాహసి నీలిమ


నేపాల్ ను తీవ్రంగా దెబ్బతీసిన భూకంపాన్ని అత్యంత దగ్గర నుంచి చూసొచ్చిన హైదరాబాదీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ తనకు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలన్న కోరిక ఇంకా చావలేదని అంటోంది. భూకంపంలో చిక్కుకున్న నీలిమ భారత ఎయిర్ ఫోర్స్ సహకారంతో న్యూఢిల్లీ చేరుకుంది. టైమొస్తే ప్రాణాలు ఎక్కడున్నా పోతాయని వ్యాఖ్యానించిన ఆమె తన కోరికను తీర్చుకునేందుకు మరోసారి ప్రయత్నిస్తానని వివరించింది. భూమి ప్రకంపించిన సమయంలో ఎవరెస్ట్ పై 4,700 అడుగుల ఎత్తులో ఉన్నామని, తాము చేరుకోవాల్సిన బేస్ క్యాంపు పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. అదృష్టం కొద్దీ మంచు చరియలు విరిగిపడ్డ ప్రదేశానికి తాము దూరంగా ఉన్నామని తెలిపింది.

  • Loading...

More Telugu News