: పాక్ సరిహద్దుల్లో ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు... ఇండియాకు ప్రమాదం: 'రా'


పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరగడం భారత భద్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదముందని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అభిప్రాయపడింది. ఇరాక్ లో రెండవ అతిపెద్ద నగరంగా పేరున్న మోసుల్ ను అధీనంలోకి తీసుకున్న తరువాత, ఐఎస్ఐఎస్ ఇతర దేశాల్లో నెమ్మదిగా విస్తరిస్తోందని, గత నెలలో ఆఫ్గన్ లో జరిగిన ఆత్మాహుతి దాడితో వారి జాడలు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రధాని కార్యాలయానికి నివేదిక ద్వారా తెలిపిన రా, ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుందని తెలిపింది. ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇటీవల భారత్ లో పర్యటించిన ఆఫ్గన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సైదం తాలిబాన్లతో తమకు భద్రతా పరమైన సమస్యలు లేవని వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News