: నేటి నుంచి తిరుమలలో కారీరిష్టి యాగం
దేశ సుభిక్షాన్ని, సకాల వర్షాలను, శాంతిని కాంక్షిస్తూ, నేటి నుంచి తిరుమలలో కారీరిష్టి, వరుణ, పర్జన్య శాంతి యాగాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే యాగ క్రతువు ఆరు రోజుల పాటు కొనసాగి, 6వ తేదీన తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో జరిగే అవబృదేష్టితో ముగుస్తుంది. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సాంబశివరావు యాగాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే యాగ నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా పేరున్న 32 మంది రుత్వికులు ఆగమయుక్తంగా యాగాలను నిర్వహించనున్నారు.