: రాణించిన లోయర్ ఆర్డర్...చెన్నై సూపర్ కింగ్స్ 165/9


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోయర్ ఆర్డర్ చలవతో 165 పరుగులు సాధించింది. టాస్ గెలిచిన గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకోగా, స్మిత్, మెక్ కల్లమ్ బ్యాటింగ్ ప్రారంభించారు. తొలి బంతికే స్మిత్ వెనుదిరగగా, రైనా (8) కూడా విఫలమయ్యాడు. దీంతో మెక్ కల్లమ్ (32) పూనకం వచ్చినవాడిలా బాది పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం డుప్లెసిస్ (20), బ్రావో (20) స్కోరు బోర్డును కదిలించారు. ధోనీ (1) నిరాశపరచడంతో జడేజా (24) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అతనికి నేగి (27) చక్కని సహకారమందించాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో 4 వికెట్లు తీసి బ్రాడ్ హాగ్ రాణించగా, రెండు వికెట్లతో ఆండ్రీ రస్సెల్ కమ్మిన్స్, యాదవ్, చావ్లా చెరో వికెట్ తీసి సహకారమందించారు. 166 పరుగుల విజయ లక్ష్యంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News