: ఈ బుల్లెట్ చాలా తెలివైనది... వెతుక్కుంటూ వెళ్లి దిగుతుంది!


బుల్లెట్ కచ్చితంగా దింపాలంటే మీరేమీ నిపుణుడైన షూటర్ అవ్వాల్సిన పనేమీలేదిక. కొత్తరకం బుల్లెట్లను అమెరికా సైన్యం విజయవంతంగా ప్రయోగించింది. ఈ సెల్ఫ్ గైడెడ్ స్మార్ట్ బుల్లెట్లను .50 కాలిబర్ బుల్లెట్లుగా పిలుస్తారు. వీటిని పేల్చితే, అవి లక్ష్యాన్ని వెతుక్కుంటూ వెళతాయి. టార్గెట్ ఎటు కదిలితే అటు దిశను మార్చుకుంటూ వెళ్లి ఛేదిస్తాయి. డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డీఏఆర్పీఏ) ఈ బుల్లెట్ల సృష్టికర్త. తాజా ప్రయోగాల్లో భాగంగా, ఓ అనుభవజ్ఞుడైన షూటర్ కదులుతున్న టార్గెట్ ను పలుమార్లు ఛేదించాడని డీఏఆర్పీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ బుల్లెట్లలో రియల్ టైం గైడెన్స్ సిస్టమ్ ను ఉపయోగించారు.

  • Loading...

More Telugu News