: రాహుల్ గాంధీకి రణతంత్రం నూరిపోస్తున్న దిగ్విజయ్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రణతంత్రాన్ని నూరిపోస్తున్నారు. శక్తిమంతమైన బీజేపీని ఎదుర్కోవాలంటే ఏం చేయాలో వివరిస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా సాయంతో దూసుకెళుతోందని, దానికి అడ్టుకట్ట వేయాలంటే, రాహుల్ కూడా సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండాలని సలహా ఇచ్చారు. ఇప్పటివరకు ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు తెరవని రాహుల్ ఇకపై సోషల్ మీడియా అకౌంట్లు తెరిచి ప్రజలతో టచ్ లో ఉండాలని సూచించారు. బీజేపీ నేతలు సోషల్ మీడియా సైట్ల ద్వారానే సగం నెగ్గుకొస్తున్నారని డిగ్గీ రాజా అభిప్రాయపడ్డారు. వారిని ఎదుర్కోవాలంటే సోషల్ మీడియానే మార్గమని తెలిపారు.