: టాలీవుడ్ లొకేషన్ చేంజ్?
ఏపీ రాజధానిగా అమరావతి ఇక అధికారికం. కొన్నేళ్లలో అక్కడ భారీ నిర్మాణాలు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు రాజధాని ప్రాంతానికి నిండుదనం తేనున్నాయి. ఈ క్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాలీవుడ్ కూడా లొకేషన్ చేంజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో హాలీవుడ్ తరహాలో భారీ స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలంటున్నాయి. రాజధానితో పాటే స్టూడియో కూడా నిర్మించేస్తే సరి అని సర్కారు భావిస్తోందట. ఇందుకుగాను సీఎం చంద్రబాబు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలతో ఓ కమిటీ వేసి, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని రంగంలోకి దిగాలనుకుంటున్నారని వినికిడి.