: మళ్లీ జైలుకెళ్లనున్న సినీ నటి నీతూ అగర్వాల్
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి నీతూ అగర్వాల్ మరోసారి జైలు కెళ్లనున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీకి సహకరిస్తోందన్న ఆరోపణలతో అరెస్టైన ఆమె రిమాండ్ ఖైదీగా కర్నూలు జిల్లా నంద్యాల జైలులో ఉంటోంది. ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని సూచిస్తూ రెండు రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. దీంతో ఆమెను నంద్యాల జైలు నుంచి రుద్రవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన గడువు నేటి సాయంత్రంతో ముగియడంతో, ఆమెను మరోసారి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో, ఆమెను నంద్యాల జైలుకు తరలించనున్నారు.