: ఆ యోగా టీచర్ కు నూకలున్నాయి!


భూకంపం నేపాల్ ను నేలమట్టం చేయగా, వేలమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరికొందరు క్షతగాత్రులై ఆసుపత్రుల పాలయ్యారు. ఇంకొందరు నీరు, ఆహారం లేక, మారుమూలప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారిలో బ్రిటన్ కు చెందిన 20 ఏళ్ల సుసన్నా రోజ్ ఒకరు. ఆమె ఐదు రోజుల పాటు ఆహారం, నీరు లేకుండా దుర్భర పరిస్థితుల నడుమ కాలం గడిపారు. ఆమెతో పాటు మరికొందరు కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు. మరికొన్ని రోజులు ఇదే స్థితి కొనసాగి ఉంటే వారి ప్రాణాలు దక్కేవికావు. అయితే, లాంగ్తాంగ్ లోయలో ఉన్న వీరిని ఆర్మీ అధికారులు గుర్తించడంతో ప్రాణాలు దక్కాయి. హెలికాప్టర్ ద్వారా వారిని సైనిక శిబిరానికి తరలించారు. ట్రెక్కింగ్ కోసం వెళ్లిన సుసన్నా భూకంపం రావడంతో ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో, ఆమె కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

  • Loading...

More Telugu News