: ప్రమాదంలో నరైన్ కెరీర్... నిషేధం అంతర్జాతీయ క్రికెట్లోనూ వర్తింపు!


కోల్ కతా నైట్ రైడర్స్ స్టార్ బౌలర్ సునీల్ నరైన్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఐపీఎల్ సందర్భంగా అతడి ఆఫ్ బ్రేక్ డెలివరీలపై విధించిన నిషేధం అంతర్జాతీయ క్రికెట్లోనూ వర్తిస్తుందని విజ్జెన్ ఇండియా అంటోంది. ఈ విషయమై విజ్డెన్ వర్గాలు ఐసీసీని కదిపాయి. నరైన్ పై నిషేధం అంతర్జాతీయ క్రికెట్లోనూ అమల్లోకి వస్తుందని ఐసీసీ నిర్ధారించింది. ఏప్రిల్ 16న దుబాయ్ లో జరిగిన సమావేశంలో, ఐసీసీ టెస్టింగ్ ప్రోటోకాల్ అనుసరించి బౌలర్లపై సభ్య దేశాల బోర్డులు తీసుకున్న నిర్ణయాలకు ఐసీసీ గుర్తింపు ఇవ్వాలన్న కొత్త నిబంధనను మండలి నియమావళిలో చేర్చారు.

  • Loading...

More Telugu News