: పారిశ్రామికీకరణకు మేము వ్యతిరేకం కాదు: సురవరం
పారిశ్రామికీకరణకు వామపక్ష పార్టీలు వ్యతిరేకం కాదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి స్పష్టం చేశారు. అయితే, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. సాగుకు పనికిరాని భూములు, సర్కారీ స్థలాలను మాత్రమే పరిశ్రమలకు కేటాయించాలని సూచించారు. అలాగే, భూసేకరణ బిల్లుకు తాము పూర్తిగా వ్యతిరేకమని... దానికి వ్యతిరేకిస్తూ ఈ నెల 14న దేశవ్యాప్త నిరసన చేపడుతున్నామని తెలిపారు.