: ఇక ఏ గ్రూపు రక్తమైనా ఒకటే... బ్రిటన్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి


ఇకపై ఓ పాజిటివ్ రక్తం కావాలి... బీ నెగటివ్ రక్తం కావాలి వంటి ప్రకటనలు కనిపించవేమో... ఎందుకంటే ఎవరి నుంచీ తీసుకున్న రక్తాన్నైనా యూనివర్సల్ గ్రూప్ రక్తంగా మార్చడంలో సైంటిస్టులు విజయం సాధించారు బ్రిటన్‌ లోని కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ మేరకు వారు తయారుచేసిన ఓ ఎంజైమ్‌ పూర్తి ఫలితాలను ఇచ్చింది. ఇప్పటివరకూ ‘ఓ’ గ్రూపు రక్తాన్ని మాత్రమే యూనివర్సల్ గ్రూప్ రక్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎంజైమ్ ను వాడితే, ఏ గ్రూప్ రక్తమైనా అందరికీ సరిపోయేలా మారుతుంది. వీరి పరీక్షలు సాధించిన విజయంతో, గ్రూప్‌ లతో సంబంధం లేకుండా ఓ మనిషి రక్తం మరో మనిషికి సరిపోవాలన్న ఉద్దేశంతో దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఫలించినట్లయింది. తాము సృష్టించిన ఈ కొత్త ఎంజైమ్ ను ఐదు తరాలపాటు ఉపయోగించాలని, అప్పుడు దీని పనితీరు 170 రెట్ల వరకూ పెరుగుతుందని, ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతి శాస్త్రవేత్త జయచంద్రన్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News