: మే 1న అల్లరి నరేశ్ నిశ్చితార్థం... అమ్మాయి పేరు విరూప


టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేశ్ ఓ ఇంటివాడవుతున్నాడు. రేపు ఆయన నిశ్చితార్థం జరగనుంది. కృష్ణా జిల్లాకు చెందిన విరూపతో నరేశ్ నిశ్చితార్థం జరగనుంది. విరూప కుటుంబం చెన్నైలో స్థిరపడింది. సీనియర్ నరేశ్, రాజేంద్రప్రసాద్ హయాం తర్వాత కామెడీ హీరోగా ప్రేక్షకులను రంజింపజేస్తున్న అల్లరి నరేశ్ ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడన్న సంగతి తెలిసిందే. 'అల్లరి' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ పొడగరి హీరో తొలి చిత్రాన్నే ఇంటిపేరుగా మలుచుకున్నాడు.

  • Loading...

More Telugu News