: చంద్రబాబుది రక్త చరిత్ర... మా పార్టీ కీలక నేతలను టార్గెట్ చేశారు: వైకాపా


నిన్న మధ్యాహ్నం అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ హత్యకు గురైన వైకాపా నేత ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు నేడు పరామర్శించారు. వీరిలో భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిప్పారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, పోతుదుర్తి ప్రకాశ్, అనంత వెంకట్రామిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబుది రక్తంతో తడిసిన చరిత్ర అంటూ ఆరోపించారు. వైకాపాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలను చంద్రబాబు టార్గెట్ చేశారని మండిపడ్డారు. వైకాపాకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే... చంద్రబాబు హత్యాకాండకు తెర లేపారని అన్నారు. త్వరలోనే ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని తమ నేత జగన్ పరామర్శిస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News